బిసి రిజర్వేషన్ల పేరుతో ఎమ్మెల్సి కవిత కొత్త నాటకం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, జూన్ 25, అద్దం న్యూస్ : బిసి రిజర్వేషన్ల పేరుతో ఎమ్మెల్సి కవిత కొత్త నాటకానికి తెరలేపిందని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా అన్నారు. బుధవారం హైదరాబాద్ టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... బిఆర్ఎస్ మహిళా నాయకురాలు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇటీవల కాలంలో ఒక్కసారి ఉలిక్కిపడి నిద్రలేచిన మాదిరిగా గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా బీసీల ఊసు కూడా ఎత్తడానికి ఇష్టపడని వీళ్లు ఇవాళ బీసీ రిజర్వేషన్ల...