మహిళలకు క్రిస్మస్ కానుకలను అందచేసిన కవిత
హైదరాబాద్, డిసెంబర్ 21, అద్దం న్యూస్ : తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య హైదరాబాద్ అధ్యక్షుడు పరకాల మనోజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కవితమ్మ క్రిస్మస్ కానుక కారిక్రమం ఆదివారం బంజారాహిల్స్ తెలంగాణ జాగృతి భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత హాజరై మహిళలకు చీరలను కానుకగా అందచేశారు. ఈ కార్యక్రమంలో లవకుమార్, రమేష్ యాదవ్, లావణ్య యాదవ్, బబ్లు, చిరంజీవి, సుధా తదితరులు పాల్గొన్నారు.![]()

![]()
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png