Addam News
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 4:35 am Posted by : Addam News

ఎమ్మెల్సీ కోదండరామ్‌కు ఆరె కటిక అభివృద్ధి సంఘం సన్మానం

ఎమ్మెల్సీ కోదండరామ్‌కు ఆరె కటిక అభివృద్ధి సంఘం సన్మానం

 హైదరాబాద్, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ :  ఎమ్మెల్సీగా నియ‌మితులైన ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌ను ఆరె కటిక అభివృద్ధి సంఘం నాయ‌కులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆరె కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి, బిసి జేఏసి రాష్ట్ర క‌న్వీన‌ర్ గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా, ఉపాధ్య‌క్షుడు కర్నికోట శ్రీనివాస్, జమాల్పూర్ శ్రీనివాస్, కేడి దినేష్ త‌దిత‌రులు కోదండ‌రామ్‌కు శాలువాలు క‌ప్పి ఘ‌నంగా స‌న్మానించారు. శాస‌న‌మండ‌లి స‌మావేశాల్లో ఆరె క‌టిక‌ల స‌మ‌స్య‌ల‌పై మాట్లాడాల‌ని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తాన‌ని కోదండ‌రామ్ హామినిచ్చినందుకు కోదండ‌రామ్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేసిన‌ట్టు ఆరె కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి, బిసి జేఏసి రాష్ట్ర క‌న్వీన‌ర్ గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా పేర్కొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png