Addam News
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 10:13 pm Posted by : Addam News

ప్లీనరీ కి భారీ ర్యాలీతో తరలి వెళ్ళిన జన సమితి నేతలు

కట్ట మైసమ్మ దేవాలయంలో ఎమ్మెల్సీ కోదండరాం ప్రత్యేక పూజలు
ప్లీనరీ కి భారీ ర్యాలీతో తరలి వెళ్ళిన జన సమితి నేతలు
– పలువురిని ఆకట్టుకున్న కళా బృందాలు

హైదరాబాద్, మే 12, ( అద్దం న్యూస్ ) :  తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హైద‌రాబాద్ లోయర్ ట్యాంక్ బండ్‌లోని కట్టమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జలవిహార్‌లో మంగ‌ళ‌వారం జ‌రిగిన‌ తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్లీనరీ సమావేశాలకు పూజలు చేసి, అనంతరం భారీ ర్యాలీతో తరలి వెళ్లారు. ర్యాలీలో అగ్రభాగాన‌ కోలాటం కళాకారులు, డబ్బు నృత్యాలు, బతుకమ్మలు, బోనాలు ఉండగా ఓపెన్ టాప్ జీవోలో కోదండరాం అభివాదం చేస్తూ ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ…. ప్లీనరిలో పలు రాజకీయ తీర్మానాలు చేసి భవిష్యత్తు కర్తవ్యాలను నిర్ధారిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.నరసయ్య, ముషీరాబాద్ కన్వీనర్ మెరుగు శ్రీనివాస్ యాదవ్, కార్మిక విభాగం కన్వీనర్ ఆకుల శ్రీనివాస్, జన సమితి నాయకులు రామ్ చందర్, జస్వంత్, జైపాల్ రెడ్డి, రవీందర్ యాదవ్, సుధాకర్, రసూల్, వెంకటయ్య, అజయ్ గౌడ్, కార్మిక నాయకులు జహీర్, బాలరాజు, కృష్ణ, బలవంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png