Addam News
Newspaper Banner
Date of Publish : 07 April 2025, 3:55 am Posted by : Addam News

బీజేపీ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు లోబడి దేశాన్ని అభివృద్ధి చేస్తున్న మోడీ – రాజ్యసభ స‌భ్యుడు, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్ట‌ర్‌.కె.లక్ష్మణ్

 

బీజేపీ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు లోబడి దేశాన్ని అభివృద్ధి చేస్తున్న మోడీ

– రాజ్యసభ స‌భ్యుడు, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్ట‌ర్‌.కె.లక్ష్మణ్

హైదరాబాద్, అద్దం న్యూస్    బీజేపీ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు లోబడి న‌రేంద్ర మోడి దేశాన్ని అభివృద్ధి చేస్తున్నార‌ని రాజ్యసభ స‌భ్యుడు, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్ట‌ర్‌.కె.లక్ష్మణ్ అన్నారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో భారతీయ జనతా పార్టీ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం ఘ‌నంగా జ‌రిగింది. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ బూత్ నెంబర్లు 271, 272 అశోక్‌న‌గ‌ర్ స‌ర్కిల్‌లో జ‌రిగిన పార్టీ ఆవిర్భావ వేడుక‌ల‌కు ముఖ్య అతిథులుగా రాజ్యసభ స‌భ్యుడు, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్ట‌ర్‌.కె.లక్ష్మణ్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్‌లు హాజ‌రై పార్టీ జెండాల‌ను ఎగుర‌వేశారు. ఈ సందర్భంగా డాక్ట‌ర్‌.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ… 1980 లో స్థాపించిన బీజేపీ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు లోబడి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ పది సంవత్సరాలలో ఆశయాలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అర్టికల్ 370, ట్రిపుల్ తలక్ రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం, ఇటీవల వ‌క్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు ఆమోదం లాంటి ప్రతిష్ఠాత్మక నిర్ణయాలతో బీజేపీ పార్టీ ద్వారా భారత దేశాన్ని ప్రపంచదేశాల్లో అగ్రగామిగా నిలబెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అద్యక్షులు భారత్ గౌడ్, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, బూత్ అధ్యక్షుడు సురేష్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, ఎం.ఉమేష్, శివ కుమార్, సత్తి రెడ్డి, ప్రకాష్ యాదవ్, మహమూద్, శ్రీనివాస్, నర్సింహ, సాయి కుమార్, లక్ష్మణ్ యాదవ్, యాదగిరి, నీరజ్, సత్యెందర్, జిడి.రాజు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png