Addam News
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 12:22 am Posted by : Addam News

విద్యానగర్‌లో కోతుల బీభ‌త్సం

విద్యానగర్‌లో కోతుల బీభ‌త్సం
– బాటసారుల పై కోతుల దాడి
– తీవ్రంగా గాయపడిన పలువురు

హైద‌రాబాద్‌, జూలై  13, ( అద్దం న్యూస్ ) :     హైదరాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ విద్యాన‌గ‌ర్‌లో కోతుల బీభత్సం రోజు రోజుకి పెరిగిపోతుంది. గత కొంత కాలం నుంచి విద్యానగర్ పరిసర ప్రాంతాలలో కోతులు వచ్చిపోయే వాహనదారులపై బాటసారిలపై దాడి చేసి గాయపరిచిన సంఘటనలు జరిగాయి. ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటలకే విద్యానగర్ మసీదు రోడ్‌లోని ట్రిలింగా అపార్ట్‌మెంట్‌ యజమాని ప్రసాద్‌ వాకింగ్ వెళుతుండగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కోతుల దాడితో ప్రసాద్ చేతి కండ బయటికి రావడంతో తీవ్ర గాయాలయి ఆసుపత్రి పాలయ్యాడు. ఇదే సమయంలో స్థానిక బ‌స్తీ వాసిపై కూడా దాడి చేసి గాయపరిచాయి. గతంలో ఈ ప్రాంతంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలు భాగ్యమ్మ ను అదే విధంగా స్థానిక వాచ్‌మెన్ పై కోతులు దాడి చేసి గాయపరిచాయి. కోతుల దాడితో తీవ్రంగా గాయపడిన ఆ వాచ్‌మెన్ గత రెండు నెలలుగా మంచానికి పరిమితమయ్యాడు. విద్యానగర్ మసీదు రోడ్ బ్రహ్మంగారి గుడి లైన్ అచ్చుత‌రెడ్డి మార్గ్, మార్క్స్ భవన్ తదితర ప్రాంతాలలో ఈ కోతులు పెద్ద ఎత్తున సర్జరీస్తూ ప్రజలను భ‌యాందోళనకు గురిచేస్తున్నాయి.

కోతుల నుంచి ప్రజలను రక్షించాలి :
విద్యానగర్ పరిసర ప్రాంతాలలో కోతులు బీభత్సం సృష్టిస్తూ పలువుని గాయపరుస్తున్నదన వాటి నుంచి స్థానిక ప్రజలకు రక్షణ కల్పించాలని తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.నరసయ్య డిమాండ్ చేశారు. ఇప్పటికే పలుమార్లు జిహెచ్ఎంసి అధికారులకు విజ్ఞప్తి చేశామని ఆన్‌లైన్‌లో మంకీ క్యాచర్స్‌కు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆయన వాపోయారు. కోతుల బెడదతో చాలా మంది ఇల్లు ఖాళీ చేయడంతో పాటు వాచ్‌మెన్లు తమ ఉద్యోగాలు ఒదిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png