Addam News
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 3:41 pm Posted by : Addam News

తెలంగాణ అమ‌ర‌వీరుల‌కు నివాళులర్పించిన ఉద్య‌మ‌కారులు

తెలంగాణ అమ‌ర‌వీరుల‌కు నివాళులర్పించిన ఉద్య‌మ‌కారులు

హైదరాబాద్, మార్చి 10, అద్దం న్యూస్ :   మిలియన్ మార్చ్ జరిగిన రోజును పుర‌స్క‌రించుకుని ముషీరాబాద్ టిఆర్ఎస్ నాయకులు తెలంగాణ అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించారు. మంగ‌ళ‌వారం రాంన‌గ‌ర్ చౌర‌స్తా వ‌ద్ద గ‌ల అమ‌ర‌వీరుల స్థూపానికి పూల‌మాల‌లేసి అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు రేషం మ‌ల్లేష్ మాట్లాడుతూ… మిలియ‌న్ మార్చ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు. మిలియ‌న్ మార్చ్ సంద‌ర్భంగా ఆనాడు ట్యాంక్ బండ్ పైకి మొదట చేరుకున్నది ముషీరాబాద్ ఉద్యమకారులే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్య‌మ‌కారులు, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు అజయ్ ముదిరాజ్, సిరిగిరి శ్యామ్, కల్వ గోపి, పున్న సత్యనారాయణ, పాశం రవి, డేగ‌ల‌ బిక్షపతి యాదవ్, కొండా సహదేవ్, ముత్యం బాలరాజు గౌడ్, నర్సింగ్, శ్రీనివాస్, మ‌హేంద‌ర్‌గౌడ్‌, వెంకటేష్, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png