తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముచ్చకుర్తి ప్రభాకర్
తిరుపతి, అక్టోబర్ 25, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ నగరం ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ మీడియా ఇన్‌చార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, పద్మ దంపతులు, ముఠా నరేష్, ఐలి కుమారస్వామి దంపతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కలియుగ దైవాన్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్‌లో రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని వెంకటేశ్వరస్వామిని కోరినట్టు ముచ్చకుర్తి ప్రభాకర్ తెలిపారు.