హైదరాబాద్, అక్టోబర్ 11, ( అద్దం న్యూస్ ) :
జాతీయ బీసీ కమిషన్ ఛైర్పర్సన్ సాధ్వీ నిరంజన్ జ్యోతి ఆదివారం హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా పలు బిసి సంఘాల నాయకులు, మేధావులు ఆమెను నగరంలోని హరిత ప్లాజాలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా మన ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బిజెపి ఓబిసి మోర్చ ఎంటలెక్చువల్ కన్వీనర్, మాజీ సైంటిస్ట్, విసిటింగ్ ప్రొఫెసర్ ( ఏఐ ) ప్రొఫెసర్ యుద్దవీర్ కట్ట ఆధ్వర్యంలో పలువురు నాయకులు నిరంజన్ జ్యోతి ని మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాన్ని అందచేసి స్వాగతం పలికారు. ముదిరాజ్లను బిసి డి నుంచి బిసి ఏ లోకి మార్చాలని, ఇతర కులాలకు ఉన్నట్టు బ్లాక్లాక్ పద్దతిని బిసిలకు వర్తింప చేయాలని, పార్లమెంట్, అసెంబ్లీ తదితర చట్ట సభల్లో బిసిలకు రిజర్వేషన్లను అమలు చేయాలని తదితర అంశాలను నిరంజన్ జ్యోతికి ప్రొఫెసర్ యుద్దవీర్ కట్ట వివరించారు. నిరంజన్ జ్యోతిని కలిసిన వారిలో మన ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు పాండు, జగదీష్ తదితరులున్నారు.![]()