ముదిరాజ్లను బిసి డి నుంచి బిసి ఏ లోకి మార్చాలి – జాతీయ బిసి కమిషన్ చైర్పర్సన్ ను కోరిన ప్రొఫెసర్ యుద్దవీర్ కట్ట
హైదరాబాద్, అక్టోబర్ 11, ( అద్దం న్యూస్ ) : జాతీయ బీసీ కమిషన్ ఛైర్పర్సన్ సాధ్వీ నిరంజన్ జ్యోతి ఆదివారం హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా పలు బిసి సంఘాల నాయకులు, మేధావులు ఆమెను నగరంలోని హరిత ప్లాజాలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా మన ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బిజెపి ఓబిసి మోర్చ ఎంటలెక్చువల్ కన్వీనర్, మాజీ సైంటిస్ట్, విసిటింగ్ ప్రొఫెసర్ ( ఏఐ ) ప్రొఫెసర్ యుద్దవీర్ కట్ట ఆధ్వర్యంలో పలువురు నాయకులు నిరంజన్ జ్యోతి ని...