తెలంగాణ హౌస్‌ఫెడ్‌ నూతన చైర్మన్‌గా ముదుగంటి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా బ్రహ్మాండబేరి గోపరాజు ఎన్నిక

హైద‌రాబాద్‌, అక్టోబర్ 5, ( అద్దం న్యూస్ ) :    తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ ( TS HOUSE FED ) నూతన చైర్మన్‌గా ముదుగంటి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా బ్రహ్మాండబేరి గోపరాజు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన TS HOUSE FED డైరెక్టర్ల ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్లు సోమవారం సమావేశమై చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకున్నారు. డైరెక్టర్లు పట్లోళ్ల శంకర్ రెడ్డి, పామర్తి అంకినేడు ప్రసాద్ నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికకు మద్దతు...