మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహన్ని ఎండోమెండ్ పరిధి నుంచి తొలగించాలి – విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ మ్యాడం వెంకట్ రావు

హైదరాబాద్, మే 19, అద్దం న్యూస్ :  మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహాన్ని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధి నుంచి వెంటనే తొలగించి మున్నూరుకాపులకు అప్పగించే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వసతి గృహం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ మ్యాడం వెంకట్ రావు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోమవారం కాచిగూడ లోని ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు పిల్లి శ్రీనివాస్ రావు, పన్నాల విష్ణువర్ధన్, అమరం చంద్రశేఖర్, ఎలగందుల దేవేందర్...