Addam News
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 7:51 pm Posted by : Addam News

నేడు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం – బిఆర్ఎస్ పార్టీ యువ నాయ‌కుడు ముఠా జైసింహా

ముషీరాబాద్‌, సెప్టెంబర్ 29, ( అద్దం న్యూస్ ) :      

ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశాన్ని నేడు ( బుధ‌వారం ) నిర్వ‌హించ‌నున్న‌ట్లు బిఆర్ఎస్ పార్టీ యువ నాయ‌కుడు ముఠా జైసింహా తెలిపారు. మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… పార్టీ అధిష్టానం ఆదేశం మేర‌కు ముషీరాబాద్‌లోని క‌షీష్ ఫంక్ష‌న్ హాల్‌లో నిర్వ‌హించ‌నున్న ఈ విస్తృత స్థాయి స‌మావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సి సుర‌భి వాణిదేవి హాజ‌ర‌వుతారని తెలిపారు. ఈ స‌మావేశానికి ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు, ఉద్యమకారులు, విద్యార్థులందరూ పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయాల‌ని ముఠా జైసింహా కోరారు.