నేడు ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం – బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహా
ముషీరాబాద్, సెప్టెంబర్ 29, ( అద్దం న్యూస్ ) : ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నేడు ( బుధవారం ) నిర్వహించనున్నట్లు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహా తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు ముషీరాబాద్‌లోని కషీష్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న ఈ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సి సురభి వాణిదేవి హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశానికి ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్...