రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ముషీరాబాద్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్
హైదరాబాద్, మే 28, అద్దం న్యూస్ : ఒక వ్యక్తికి సంబంధించిన ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం లక్ష రూపాయలను డిమాండ్ చేసిన ముషీరాబాద్ తహశిల్థార్ కార్యాలయం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రూ.25 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అతన్ని పట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి... ముషీరాబాద్ తహశిల్థార్ పరిధిలో ఒక వ్యక్తి తన కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశాడు. తహశిల్థార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పని...