Addam News
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 7:37 pm Posted by : Addam News

Naa Anveshana : ప్రపంచ యాత్రను ఆపేస్తున్నా.. – నా అన్వేష‌ణ సంచ‌న‌ల నిర్ణ‌యం

Naa Anveshana : ప్రపంచ యాత్రను ఆపేస్తున్నా..
– నా అన్వేష‌ణ సంచ‌న‌ల నిర్ణ‌యం

అద్దం న్యూస్, వెబ్ డెస్క్ : ప్ర‌పంచ యాత్రికుడు నా అన్వేష‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్ర‌పంచంలోని 130 దేశాల్లో యాత్ర చేసి అక్క‌డి వింత‌లు, విశేషాలు, అక్క‌డి ప్ర‌జ‌ల జీవ‌న విధానాల‌ను యూ ట్యూబ‌ర్ ద్వారా ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేసి ప్ర‌జ‌ల‌కు ద‌క్క‌ర‌య్యాడు. ఇటీవ‌ల సినీ న‌టుడు శివాజి ఓ కార్య‌క్రమంలో హీరోయిన్ల‌పై చేసిన వ్యాఖ్య‌ల నేప‌ధ్యంలో నా అన్వేష‌ణ కూడా స్పందించాడు. శివాజి కి కౌంట‌ర్ ఇస్తూనే సీతాదేవి, ద్రౌప‌ది ల పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన అన్వేష్ దేశ వ్యాప్తంగా యూ ట్యూబ‌ర్ల నుంచి, హిందు సంఘాల నుంచి విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నాడు. అయితే ఇక నుంచి ప్ర‌పంచ‌యాత్ర‌ను ఆపివేస్తున్న‌ట్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా నా అన్వేష్ ఓ వీడియోను విడుద‌ల చేశాడు. ప్ర‌పంచ యాత్ర ద్వారా తాను 8 కోట్ల రూపాయ‌ల‌ను సంపాదించాన‌ని, ఆ 8 కోట్ల‌ను కూర్చొని తినేద్దామ‌నుకుందామ‌ని అనుకుంటున్న‌ట్లు నా అన్వేష‌ణ స్ప‌ష్టం చేశారు. అలాగే కొత్త వాళ్ల‌కు అవ‌కాశాలు ఇద్దామ‌ని, కొత్త ర‌క్తం రావాల‌ని ఆకాంక్షించారు. అలాగే ఆన్‌లైన్ స్కాంలు, లోన్ యాప్‌లు, డేటింగ్ యాప్‌ల నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు పోరాడుతాన‌ని, అలాగే రేప్‌ల పై, స్త్రీ హక్కులపై పోరాడదామ‌ని, ప్రాణాలు ఉన్నంత వరకూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు.

https://www.instagram.com/reel/DTZP_enk3F7/?igsh=dzJwNzdhMDZweGV3

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png