యుద్ధ గీతాల సుద్దాల జాతీయ పురస్కారాలు – ఈ నెల‌ 26 న రవీంద్రభారతిలో ప్రదానోత్సవం

హైద‌రాబాద్‌, అక్టోబర్ 22, ( అద్దం న్యూస్ ) :     కాలుకు గజ్జ కట్టి, భుజాన గొంగడి వేసుకుని, ఒకవైపు గన్ను మరోవైపు పెన్ను పట్టుకుని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పల్లె పల్లెకు పాటను ప్రవహింపజేసిన యుద్ధ గీతాల రచయిత సుద్దాల హనుమంతు పేరిట 15వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం ఈ నెల 26న రవీంద్రభారతిలో ఘనంగా జరగనుంది. ఈ సంవత్సరం ప్రముఖ రచయిత్రి, 100 పుస్తకాల అనువాదకురాలు స్వాతి శ్రీపాదకు సుద్దాల జాతీయ పురస్కారం, అలాగే జాతీయ జానపద అవార్డు యక్షగాన...