Addam News
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 4:40 am Posted by : Addam News

సిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రీలో కొన‌సాగుతున్న‌ జాతీయ గ్రంథాల‌య వారోత్స‌వాలు

చిక్క‌డ‌ప‌ల్లి, న‌వంబ‌ర్ 17, ( అద్దం న్యూస్ ) :

హైద‌రాబాద్ న‌గ‌ర కేంద్ర గ్రంథాల‌యంలో 59 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవ వేడుక‌లు కొన‌సాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం మాడపాటి హనుమంతరావు స్కూల్ విద్యార్థినీలు, ముషీరాబాద్ ప్రభుత్వ స్కూలు, భారతీయ విద్యా భవన్ స్కూల్ విద్యార్థులు వ్యాసరచన పోటీలో పాల్గొన్నారు. వంద మంది విద్యార్థులు అదే విధంగా విద్యార్థుల కొరకు మిమిక్రీ షో, హాస్య నాటకం త‌దిత‌ర కార్యక్రమాలను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో హైదరాబాద్ నగర‌ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి ఎం.అలివేలు, ప్రథమ శ్రేణి గంధ పాలకురాలు చంద్రకళ, ద్వితీయ శ్రేణి గంధపాలకురాలు పద్మశ్రీ, ద్వితీయ శ్రేణి గ్రందాపాలకుడు బొల్లం మహేందర్, జంగారెడ్డి, సత్యం, అనిల్, శ్రీనివాసరాజు, అమరావతి, భాగ్య, ఉమా, నాగచైతన్య, బిపిన్, శ్రీకాంత్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగస్తులు, స్కూల్ టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.