నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి –సికింద్రాబాద్ శాసనసభ్యుడు తీగుల్ల‌ పద్మారావు గౌడ్ ఆకాంక్ష

సికింద్రాబాద్, అక్టోబర్ 13, ( అద్దం న్యూస్ ) : నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సికింద్రాబాద్ శాసనసభ్యుడు తీగుల్ల‌ పద్మారావు గౌడ్ అన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిలకలగూడ‌లోని చారిత్రాత్మక కట్ట మైసమ్మ దేవాలయాన్ని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ మంగళవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ప్రారంభించారు. ప్రజలందరూ నవరాత్రి వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పద్మారావు గౌడ్ ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్...