నేతాజి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అర్చకులకు సన్మానం
నేతాజి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అర్చకులకు సన్మానం హైదరాబాద్, అక్టోబర్ 3, అద్దం న్యూస్ : దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వీధిలో నేతాజి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలో విశేష సేవలందించిన అర్చకులు, కళ్యాణ ఆనంద పీఠాధ్యక్షుడు, ఆత్మబంధు డాక్టర్.పులిగడ్డ హనుమంతరాయ శర్మ, హంస అవార్డు గ్రహీతలు నాగరాజ శర్మ, సాయినాథ శర్మలకు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా నేతాజి ఫ్రెండ్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ పలుస...