కుప్పకూలిన ఆలయం.. భారత సంతతి వ్యక్తి మృతి

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ :  దక్షిణాఫ్రికాలోని క్వాజులు నాటల్‌ ప్రావిన్స్‌లో నిర్మాణంలో ఉన్న 'న్యూ అహోబిలం' ఆలయం కూలిపోవడం స్థానికంగా మరియు భారతీయ వర్గాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఊహించని దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు. మరణించిన భారతీయ వ్యక్తి.. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో 52 ఏళ్ల విక్కీ జైరాజ్ పాండే అనే భారత సంతతి వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన ఆలయ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, ఈ నిర్మాణ ప్రాజెక్టుకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. సుమారు రెండేళ్లుగా...