కాచిగూడ, అక్టోబర్ 12, ( అద్దం న్యూస్ ) : వ్యాపారాభివృద్ధికి వినియోగదారుల అపార నమ్మకమే పెట్టుబడి అని ఆంబర్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. సోమవారం కాచిగూడ డి మార్ట్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన పవిత్రత ఫుడ్ కోర్టును ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కాచిగూడ మాజీ కార్పొరేటర్ ఉమాయాదవ్, జైన్ సంగం ప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పవిత్రత పుడ్కోర్టు నిర్వహకుడు ఉదేంద్రకుమార్, నాగోర్ జైన్ సంఘ్ చైర్మన్ శ్రీపాల్ జైన్, ఓస్వాల్ జైన్ కోఠి ఆధ్యక్షుడు మహావీర్ జైన్, మేనేజర్ ఉత్కశ్, డాక్టర్ శిరీషా యాదవ్, ఓం ప్రకాశ్ యాదవ్, కన్నె రమేషాయాదవ్, ఎర్ర భీష్మాదేవ్, ధాత్రిక్ నాగేందర్ బాబ్జి, బబ్లూ సింగ్, అంటో, పట్లూరి సతీశ్, శ్రీకాంత్ ముదిరాజ్, నర్సింగ్ బాబు, బుచ్చిరెడ్డి, పొత్కల్ సంతోశ్, తదితరులు పాల్గొన్నారు.