Japan: అక్కడ మూడో తరగతి వరకు ‘నో ఎగ్జామ్స్’

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: జపాన్‌ (Japan) దేశంలో విద్యా వ్యవస్థకు ప్రత్యేకమైన లక్షణం ఉంది. అక్కడ మూడో తరగతి వరకు విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు, హోంవర్క్‌ (No exams)లు లేదా ర్యాంకులు ఉండవు. ఈ మొదటి మూడేళ్లను వారు విద్యా పునాది కాకుండా మనుష్యత్వం, క్రమశిక్షణ, మరియు సామాజిక విలువలను నేర్చుకునే కాలంగా భావిస్తారు. చిన్న పిల్లల్లో సహకారం, సమయపాలన, మంచి అలవాట్లు, మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తన పెంపొందించడం ప్రధాన ఉద్దేశ్యం. పిల్లలు తమ స్కూల్‌ బ్యాగ్‌ ను తామే సర్దుకుంటారు, క్లాస్‌రూమ్‌ ని...