Addam News
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 4:55 am Posted by : Addam News

డీజే సౌండ్‌, ఊరేగింపుల‌కు ఎవ‌రు బ‌లికావొద్దు – మృతుడు బ‌ద్రినాథ్ త‌ల్లి

డీజే సౌండ్‌, ఊరేగింపుల‌కు ఎవ‌రు బ‌లికావొద్దు
వినాయ‌కుడే నా కొడుకును పొట్ట‌న పెట్టుకున్నాడు
డిజే సౌండ్‌తోనే నా కొడుకు మృతి చెందాడు
– మృతుడు బ‌ద్రినాథ్ త‌ల్లి

హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 8, ( అద్దం న్యూస్ ) :  వినాయ‌కుడే నా కొడుకును పొట్ట‌న పెట్టుకున్నాడని, డీజే సౌండ్‌, ఊరేగింపుల‌కు వెళ్లి ఎవ‌రు బ‌లికావొద్దని ఈ నెల 5వ తేదీ రాత్రి రాంన‌గ‌ర్ చౌర‌స్తాలో జ‌రిగిన‌ గ‌ణేష్ ఆగ‌మ‌న్ లో మృతి చెందిన బ‌ద్రినాథ్ త‌ల్లి ఆవేద‌న వ్య‌క్తం చేసింది. గాంధీ ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో ఆమె క‌న్నీటిప‌ర్యంత‌మైంది. వినాయ‌కచ‌వితి ఉత్స‌వాల్లో డీజే సౌండ్‌లు, హంగు ఆర్భాటాలు చేయ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసులను కోరింది. దేవుడేమి మ‌న‌ల్ని బ‌తికియ్య‌డ‌ని, మ‌నం క‌ష్ట‌ప‌డితేనే బ‌తుకుతామ‌ని, రాను రాను రోజుల్లో ఇంకా ఎంత మంది బ‌లి అవుతారో… ద‌య‌చేసి పిల్ల‌లు ఇళ్ల‌ల్లో ఉండండి తండ్రి అని ఆమె రోధించింది. తన కుమారుడి మరణానికి డీజేల విచ్చలవిడి వాడకం, నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని ఆమె ఆరోపించారు. రాత్రి తొక్కిస‌లాట‌లో ఊపిరాడకపోవటం వల్లనే బ‌ద్రినాథ్‌ మృతి చెందాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png