‘నోబెల్’ గ్రహీత అరెస్ట్..
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, 2023 నోబెల్ శాంతి పురస్కార గ్రహీత (Nobel Peace Prize) నర్గెస్ మొహమ్మదిని ఇరాన్ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నట్లు ఆమె మద్దతుదారులు, మానవ హక్కుల సంస్థలు వెల్లడించాయి. తాజా సమాచారం ప్రకారం.. ఇటీవల అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఓ న్యాయవాది స్మారక చిహ్నం వద్ద నర్గెస్ మొహమ్మదిని పోలీసులు నిర్బంధించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, ఆమె అరెస్ట్‌పై ఇరాన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు. ఇరాన్‌లో మహిళా హక్కులు, సమానత్వం కోసం...