మైనార్టీ గురుకుల నాన్ శాంక్షన్ పోస్ట్ ( NSP ) వర్కర్లకు రూ.30 వేల వేతనం ఇవ్వాలి – రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్, అక్టోబర్ 12, ( అద్దం న్యూస్ ) : మైనార్టీ గురుకులాల్లో పనిచేస్తున్న నాన్ శాంక్షన్ పోస్ట్ ( NSP ) డైలీ వేజ్ వర్కర్లకు రూ.30 వేల వేతనం ఇవ్వాలని, వారిని ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన క్రమబద్ధీకరించాలని, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద మైనార్టీ గురుకుల నాన్ శాంక్షన్ పోస్ట్ ( NSP ) డైలీ వేజ్ ...