Addam News
Newspaper Banner
Date of Publish : 28 May 2025, 10:19 pm Posted by : Addam News

ఘ‌నంగా యుగ పురుషుడు ఎన్‌టిఆర్‌ జయంతి వేడుక‌లు

హైద‌రాబాద్‌, మే 28, అద్దం న్యూస్ :   తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగ‌త ఎన్‌టి.రామారావు 102వ జయంతి వేడుక‌లు బుధ‌వారం దోమ‌ల‌గూడ‌లోని న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా ఎన్‌టిఆర్ త‌న‌యుడు నంద‌మూరి రామ‌కృష్ణ హాజ‌రై ఎన్‌టిఆర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా పేద మ‌హిళ‌ల‌కు ఉచితంగా చీర‌ల పంపిణీ చేశారు. అనంత‌రం ఎన్‌టిఆర్ ఘాట్ వద్ద నందమూరి రామకృష్ణ, టిడిపి పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా త‌దిత‌రులు ఎన్‌టిఆర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్బంగా రామకృష్ణ మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయాల కోసమే కాకుండా సేవా దృక్పథంతో ఉండడమే తెలుగుదేశం పార్టీ ఆదర్శం అని, అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలతో మమేకమై ఉండడమే తెలుగుదేశం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు.

పార్లమెంటు అధ్యక్షులు పి.సాయిబాబా మాట్లాడుతూ… ఎన్‌టిఆర్‌ ఆశయాలకు, ఆదర్శాల కోసం అనుగుణంగా అందరూ కృషి చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగ‌త ఎన్‌టిఆర్‌కు భారత రత్న పురస్కారం అందజేయాలని డిమాండ్ చేసారు. తెలంగాణలో పటేల్ పట్వారి వ్యవస్థను రూపుమాపి సామాన్యునికి రాజకీయ భవిష్యత్తును కల్పించిన ఘనత ఎన్‌టిఆర్‌దే అని అన్నారు. సమాజంలో ఉన్న వెనుకబడిన వర్గాలకు రాజకీయాలలో చైతన్యం కల్పించడం, అన్ని వర్గాల ప్రజలకి సమాన న్యాయం చేసిన ఏకైక నాయకుడు ఎన్‌టిఆర్‌, ఈరోజు సంక్షేమ అంటూ అన్ని పార్టీలు ప్రచార ఆర్బాటాలు చేస్తున్నవన్నీ ఎప్పుడో ఎన్‌టిఆర్‌ చేపట్టిన పథకాలేనని అన్నారు. ఆనాడు ఎన్‌టిఆర్‌ చేపట్టిన 2 రూపాయ‌ల‌కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, సగం ధరకే కరెంటు, ఆడబిడ్డకు ఆస్తీలో సగభాగం, దున్నే వాడిదే భూమి ఇలాంటి ఏన్నో సంక్షేమ పథకాలు ఆయన ఆరంభించినవే అని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, పరుశురామ్, ఎంఎ.సిద్దీఖి, ఎస్.ప్రకాష్, ప్రమీల, జాన్సి, శ్రీనివాస్ గౌడ్, శ్యామ్ సుందర్, ప్రదీప్ గౌడ్, పి.బాలకృష్ణ, వెంకటేష్ చౌదరి, కిరణ్, పి.వీరబాబు, రాజు, భాను ప్రకాష్, శక్తి ప్రేమ్, వి.రామారావు, ధనరాజ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png