ఘనంగా యుగ పురుషుడు ఎన్‌టిఆర్ జయంతి వేడుకలు
హైదరాబాద్, మే 28, అద్దం న్యూస్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్‌టి.రామారావు 102వ జయంతి వేడుకలు బుధవారం దోమలగూడలోని నగర టిడిపి కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎన్‌టిఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ హాజరై ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ చేశారు. అనంతరం ఎన్‌టిఆర్ ఘాట్ వద్ద నందమూరి రామకృష్ణ, టిడిపి పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా తదితరులు ఎన్‌టిఆర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్బంగా రామకృష్ణ...