ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో 31పై అభ్యంత‌రాలు.. యూజీసీ నిబంధ‌న‌లు పాటించ‌లేద‌న్న టీడీఏ

తార్నాక, అక్టోబర్ 13, ( అద్దం న్యూస్ ) :    తెలంగాణ ఉన్న‌త విద్యా శాఖ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి జారీ చేసిన జీవో నెంబ‌ర్ 31లో అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. యూజీసీ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ప‌లు అంశాలు ఉన్నాయ‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌కు కొత్త‌గా నిబంధ‌న‌లు పెట్ట‌డం స‌రైన‌ది కాదన్న వాద‌న‌లు వినిపిస్తున్నారు. ఎంట్రీ లెవ‌ల్‌లో ఉండే పోస్టుకు అసోసియేట్ ప్రొఫెస‌ర్‌కు పెట్టే అర్హ‌త‌ల‌ను అసిస్టెంట్‌కు పెట్ట‌డం అభ్యంత‌ర‌క‌ర‌మంటున్నారు. ముఖ్యంగా అనుభ‌వ‌జ్ఞుల‌ను దూరం పెట్టేందుకు ఉన్న‌త విద్యాశాఖ అధికారులు ప్రాధాన్య‌త...