అధికారులు సమన్వయంతో పని చేసి డివిజన్ అభివృద్ధికి సహకరించాలి – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేసి డివిజన్ అభివృద్ధికి సహకరించాలి – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, జులై 14, అద్దం న్యూస్ : అన్ని విభాగాల ప్రభుత్వాధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి డివిజన్ అభివృద్ధికి సహకరించాలని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ సూచించారు. సోమవారం కార్పొరేటర్ కార్యాలయంలో అధికారులతో కార్పొరేటర్ పావని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వాటర్ వర్క్స్ డిజిఎం కార్తీకరెడ్డి, మేనేజర్ కృష్ణమోహన్, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ఏఈ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్‌స్పెక్టర్...