హైదరాబాద్ నగరంలో దోమలు విజృంభన
దోమల నివారణ చర్యల్లో అధికారులు, ప్రభుత్వం శూన్యం
– తెలుగుదేశం సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకుడు నల్లెల్ల కిషోర్ ధ్వజం
హైదరాబాద్, సెప్టెంబర్ 1, ( అద్దం న్యూస్ ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని దోమల నిలయంగా మారిందని, తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు నల్లెల్ల కిషోర్, మాజీ కార్పొరేటర్ బాలరాజ్ గౌడ్ లు విమర్శించారు. హైదరాబాద్ దోమలగూడలోని నగర టిడిపి పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… హైదరాబాద్ నగరంలో మునుపెన్నడూ లేని విధంగా దోమల బెడద తీవ్రతరమైందని, దీనికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని వారు దుయ్యబట్టారు. నగరంలోని చెరువులు గుర్రపుడెక్క పేరుకుపోయి దోమలకు నిలయంగా మారాయని, ముఖ్యంగా మూసాపేట, మల్కాజగిరి, కూకట్‌పల్లి, అత్తాపూర్, ఉప్పల్ ప్రాంతాలు దోమల హాట్ స్పాట్లుగా మారి, ప్రజలు రాత్రి వేళల్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. జీహెచ్‌ఎంసీ చేపడుతున్న ఫాగింగ్, యాంటీ లార్వా కార్యకలాపాలు క్షేత్రస్థాయిలో నామ మాత్రంగానే చేస్తున్నారని, సరిపడా ఫాగింగ్ మిషన్లు కూడా లేవని, వాడుతున్న రసాయనాలకు దోమలు అలవాటు పడి ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని అన్నారు.
అపార్ట్‌మెంట్ సెల్లార్లు, నాలాల్లో మురుగునీరు నిలిచి దోమల వృద్ధికి కారణమవుతోందన్నారు. ఫలితంగా నీలోఫర్, గాంధీ, ఫీవర్ హాస్పిటళ్లు రోగులతో కిక్కిరిసి పోతున్నా… ప్రభుత్వానికి ఏమాత్రం చీమ కుట్టినట్టైనా లేదని వారు విమర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముందస్తు చర్యలు ఉండేవని, కానీ నేటి కాంగ్రెస్ పాలన పూర్తిగా దిగజారిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన యాక్షన్ ప్లాన్-2026 కాగితాలకే పరిమితమైందని, యాక్షన్ ప్లాన్‌ను పక్కాగా అమలు చేసి సమస్య లేకుండా చూసే వారు కరువయ్యరని అన్నారు. గతంలో కార్పొరేటర్లు ఉన్నా తమ సమస్య వారితో నైనా చెప్పుకునేవారని… జిహెచ్ఎంసి పదవీ కాలం పూర్తయి 8 నెలలు గడుస్తున్నా ఎన్నికలకు దిక్కేలేదని, ప్రజల అధికారులకు చెప్పినా… ప్రజల సమస్య పట్టించుకోవడం లేదని అన్నారు. విష జర్వాలు ( డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ) వంటి సిజ్నల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా మంత్రులు.. అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని అన్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం నిండి ఉందని, దీనితో దోమలు, క్రిమి కీటకాలు వృద్ది చెంది ప్రజలు రోగాల బారిన పడ్తున్నారని, నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా వెంటనే ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని, యుద్ధ ప్రాతిపదికన చెరువుల నుండి గుర్రపుడెక్కను తొలగించి, ప్రతి డివిజన్‌లో ఫాగింగ్ మిషన్ల సంఖ్యను పెంచి, నిరంతరం యాంటీ లార్వా ప్రోగ్రాంలను చేపట్టాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు తడక వినోద్, శ్యామ్ సుందర్, కరణం కిరణ్, ఇ.భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply