Addam News
Newspaper Banner
Date of Publish : 16 March 2025, 10:55 pm Posted by : Addam News

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సర్క్యులర్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలి

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సర్క్యులర్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలి

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ :  ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధికారులు నియంతృత్వ, ఆంక్షల సర్క్యులర్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలి అని పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్‌వి.శ్రీకాంత్, పొడపంగి నాగరాజు లు ఆదివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. భారతదేశంలో చారిత్రాత్మకమైన విశ్వవిద్యాలయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒకటన్నారు. ప్రజా ఉద్యమాలను నిర్మించి అనేక విజయాలు సాధించిన ఘనత ఓయూ ది అని అన్నారు. మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి, మలిదశ తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసి, క్రియాశీలకమైన పాత్ర పోషించిన అనేక రాజ్య నిర్బంధాలను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఓయుద‌న్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, విద్యార్థి విధానాలపై ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని నింపి ప్రగతిశీల ఉద్యమాల వైపుకు నడిపించి ఓయూలో విద్యార్థుల సమస్యలను ప్రజాస్వామికంగా యూనివర్సిటీ అధికారులకు తెలియజేసే పద్ధతిని కూడా ఉక్కు పాదంతో నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని తెలిపారు. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల హక్కులను హరించే విధంగా యూనివర్సిటీ అధికారులతో సర్కులర్ జారీ చేయించ‌డం ప్రభుత్వ అప్రజాస్వామిక పాలనకు నిదర్శనమ‌న్నారు. నిర్బంధాలతో విద్యార్థి ఉద్యమాలను ఆపలేరని, తక్షణమే సర్కులర్‌ను వెనక్కి తీసుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన పెద్ద ఎత్తున బలమైన విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png