ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సర్క్యులర్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలి
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సర్క్యులర్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలి హైదరాబాద్, అద్దం న్యూస్ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధికారులు నియంతృత్వ, ఆంక్షల సర్క్యులర్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలి అని పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్‌వి.శ్రీకాంత్, పొడపంగి నాగరాజు లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారతదేశంలో చారిత్రాత్మకమైన విశ్వవిద్యాలయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒకటన్నారు. ప్రజా ఉద్యమాలను నిర్మించి అనేక విజయాలు సాధించిన ఘనత ఓయూ ది అని అన్నారు. మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి, మలిదశ తెలంగాణ ఉద్యమానికి పురుడు...