Addam News
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 5:12 am Posted by : Addam News

ప‌ద్మ‌శాలీలు రాజ‌కీయంగా ఎద‌గాలి – వక్త‌లు

ప‌ద్మ‌శాలీలు రాజ‌కీయంగా ఎద‌గాలి 

హైదరాబాద్, జ‌న‌వ‌రి 26, అద్దం న్యూస్ :   ప‌ద్మ‌శాలీలు రాజ‌కీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా ఎద‌గాల‌ని ప‌లువురు వ‌క్త‌లు పేర్కొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఏటా జరిగే పద్మశాలి రాజకీయ చైతన్య వేదిక ( మేళా ) ఆదివారం హైద‌రాబాద్ ఇందిరాపార్కులో ఘనంగా నిర్వహించారు. ఈ మేళాకు హ‌ర్యానా మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్‌, ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌, మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్, క‌వాడిగూడ‌, గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ల కార్పొరేట‌ర్లు ర‌చ‌న శ్రీ, ఎ.పావ‌ని, బిజేపి రాష్ట్ర కార్య‌ద‌ర్శి విజ‌య‌ల‌క్ష్మీ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… ప‌ద్మ‌శాలీల అభ్యున్న‌తి కోసం అంద‌రూ కృషి చేయాల‌న్నారు.

ముషీరాబాద్ నియోజకవర్గం పద్మశాలీ సంఘం అధ్యక్షుడు అతినగరం సుదేశ్ అధ్యక్షతన ఈ మేళా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఏబిపిఎస్ కార్య‌ద‌ర్శి, సంఘం గౌర‌వ స‌ల‌హాదారుడు బొడ్డు తిరుప‌తి ఆధ్వ‌ర్యంలో అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ జ‌రిగింది. ఈ కార్యక్రమంలో ప‌ద్మ‌శాలి సంఘం అధ్య‌క్షుడు వ‌ల్ల‌కాటి రాజు, ముషీరాబాద్ నియోజకవర్గం పద్మశాలి సంఘం నాయ‌కులు మంథెన ద‌శ‌ర‌థ్‌, బోనం ఊర్మిళ‌, బోడ నిర్మ‌ల‌, గుర్రం చంద్ర‌క‌ళ‌, గుంట‌క రూప‌, కైరంకొండ స్వ‌రూప‌, అనుశ్రీ, బొమ్మర్ల‌ సతీష్, నారాయ‌ణ‌మూర్తి, సోమ సతీష్, సెరిప‌ల్లి గ‌ణేష్‌, బోనమ్ బన్నీ, ఎయిర్‌టెల్ రాజు, బొట్టు శ్రీనివాస్, ఆంజ‌నేయులు, తుమ్మ శ్రీను, అనిల్, బిజెపి నాయ‌కులు విన‌య్ కుమార్‌, వెంక‌టేష్‌, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png