Addam News
Newspaper Banner
Date of Publish : 03 January 2026, 9:20 am Posted by : Addam News

Pan India Movies: రూ.1000 కోట్ల టార్గెట్ తో వస్తున్న పాన్ ఇండియా చిత్రాలు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారతీయ సినీ పరిశ్రమలో 2026 సంవత్సరం సరికొత్త రికార్డులకు వేదిక కానుంది. కేవలం హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల మైలురాయిని అందుకోవడమే లక్ష్యంగా పలు భారీ బడ్జెట్ చిత్రాలు (Pan India Movies) విడుదలకు సిద్ధమవుతున్నాయి. స్టార్ హీరోలు, అగ్ర దర్శకుల కాంబినేషన్లలో వస్తున్న ఈ సినిమాలు.. ఇండియన్ సినిమా స్టామినాను మరోసారి ప్రపంచానికి చాటనున్నాయి.

అంచనాల్లో ఉన్న ప్రధాన చిత్రాలు:

రామాయణం (Ramayana): నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), సాయి పల్లవి, యశ్ నటిస్తున్న ఈ విజువల్ వండర్ పై (Pan India Movies) భారీ అంచనాలు ఉన్నాయి. సుమారు రూ.800 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం రూ.2000 కోట్లను టార్గెట్ చేస్తోంది.
జననాయగన్ (Jana Nayagan): దళపతి విజయ్ (Thalapathy Vijay) చివరి చిత్రంగా ప్రచారంలో ఉన్న ఈ సినిమా హెచ్. వినోద్ దర్శకత్వంలో జనవరి 9, 2026న విడుదల కానుంది.
టాలీవుడ్ హవా: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ (The Raja Saab), హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ‘డ్రాగన్’, రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలు (Pan India Movies) కూడా ఈ రేసులో ఉన్నాయి.
రజినీ & షారుఖ్: రజినీకాంత్ ‘జైలర్ 2’ (హుకుం), షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సినిమాలు కూడా బాక్సాఫీస్ షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
2026లో సినీ ప్రియులకు ఈ (Pan India Movies) చిత్రాలు విందు భోజనంలా మారనున్నాయి. మరి వీటిలో ఏ సినిమా అత్యధిక వసూళ్లు రాబడుతుందో వేచి చూడాలి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png