Addam News
Newspaper Banner
Date of Publish : 11 December 2025, 7:28 am Posted by : Addam News

Panchayat elections: తొలి విడత పోలింగ్‌ ప్రారంభం

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ :  తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayat elections) పోలింగ్‌ ప్రారంభమైంది. 3,834 సర్పంచి, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. 37,562 పోలింగ్‌ కేంద్రాల్లో 56,19,430 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి.. ఉపసర్పంచి ఎన్నికలు నిర్వహిస్తారు.

తొలి దశలో 4,236 గ్రామపంచాయతీ సర్పంచి పదవులకు.. 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడింది. వీటిలో ఐదు సర్పంచి పదవులకు, 169 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 396 సర్పంచి పదవులు.. 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఒక గ్రామపంచాయతీ సర్పంచి, 10 వార్డు స్థానాల ఎన్నికలపై న్యాయస్థానాలు స్టే విధించాయి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png