Panchayat elections: తొలి విడత పోలింగ్ ప్రారంభం
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ : తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayat elections) పోలింగ్ ప్రారంభమైంది. 3,834 సర్పంచి, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. 37,562 పోలింగ్ కేంద్రాల్లో 56,19,430 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి.. ఉపసర్పంచి ఎన్నికలు నిర్వహిస్తారు. తొలి...