Addam News
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 2:09 am Posted by : Addam News

సైద్ధాంతిక భూమికను, వ్యవస్థను నిర్మాణం చేసిన గొప్ప మహానుభావుడు పండిట్ దీన్ ద‌యాల్ ఉపాధ్యాయ‌ – మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌

రాంన‌గ‌ర్‌, సెప్టెంబర్ 25, ( అద్దం న్యూస్ ) :   సైద్ధాంతిక భూమికను, వ్యవస్థను నిర్మాణం చేసిన గొప్ప మహానుభావుడు పండిట్ దీన్ ద‌యాల్ ఉపాధ్యాయ అని మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ అన్నారు. హైద‌రాబాద్ రాంన‌గ‌ర్‌లోని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో  “ అంత్యోదయ దివస్ ” సందర్భంగా పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ 110 వ జయంతి కార్య‌క్ర‌మం జ‌రిగింది. శుక్ర‌వారం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో దత్తాత్రేయ పండిట‌ల్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ చిత్ర ప‌టానికి పూల‌మాలలేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ద‌త్తాత్రేయ మాట్లాడుతూ… ఆనాటి “ భారతీయ జన్ సంఘ్ ”  నేటి “ భారతీయ జనతా పార్టీ ” కి నిస్వార్ధ ప్రజాసేవకుడని, గొప్ప దేశ భక్తుడని కొనియాడారు. ” సరళమైన జీవనం, ఉన్నతమైన ఆలోచన ” ( Simple Living, High Thinking ) అనే వారి ప్రబోధాలు, ” పెట్టుబడిదారీ విధానం, సామ్యవాదానికి ” ( Capitalism and Socialism ) ప్రత్యామ్నాయం దేశానికి ఏకాత్మ మానవతావాదమే నిజమైన అభివృద్ధికి సోపానమని ప్రవచించిన పండిట్ దీన్ దయాళ్ అన్నారు. అటువంటి మహానుభావుడని, వారికి నిజమైన నివాళులు అర్పించడమంటే రాజకీయాల్లో నైతిక విలువలు పాటించడం, నీతి నిజాయితీగా వ్యవహరించడమే అని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అడిక్‌మెట్ డివిజన్ అధ్యక్షుడు పాశం సాయి కృష్ణ యాదవ్, బిజెపి రాష్ట్ర వికలాంగుల సెల్ కన్వీనర్ నాగేశ్వర్ రావు, నాయ‌కులు వంశీ కృష్ణ‌, జ‌గ‌దీష్‌, రాగిటి నరేష్, కిషోర్, ఓం ప్రకాష్, సంగం బాలరాజ్, షిండే గణేష్, శేఖర్ వర్మ త‌దితర నాయకులు పాల్గొన్నారు.