Addam News
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 3:40 am Posted by : Addam News

తెలంగాణ ర‌క్ష‌ణ సేన హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షుడిగా ప‌ర‌కాల మ‌నోజ్ గౌడ్

హైద‌రాబాద్‌, ( అద్దం న్యూస్ ) :   

తెలంగాణ ర‌క్ష‌ణ సేన ( టిఆర్ఎస్ ) పార్టీ హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షుడిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌ ప‌ర‌కాల మ‌నోజ్ గౌడ్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ఆయ‌న‌కు తెలంగాణ ర‌క్ష‌ణ సేన పార్టీ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ర‌క్ష‌ణ సేన హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షుడిగా నియ‌మితులైన ప‌ర‌కాల మ‌నోజ్ గౌడ్ మాట్లాడుతూ… నాకు తెలంగాణ రక్షణ సేన పార్టీ హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో అత్యంత గర్వించదగిన క్షణమ‌న్నారు. నాలాంటి సామాన్య కార్యకర్తను గుర్తించి, ఇంతటి గురుతర బాధ్యతను నా భుజస్కంధాలపై పెట్టిన పార్టీ అధివర్గానికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన పార్టీ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత చూపిన‌ మార్గదర్శకత్వంలో హైదరాబాద్‌లో పార్టీ జెండాను మరింత ఎత్తులో ఎగరవేయడానికి ప్రతి క్షణం శ్రమిస్తానని అన్నారు. రాబోయే రోజుల్లో వ‌చ్చే ఏ ఎన్నిక‌లైనా తెలంగాణ ర‌క్ష‌ణ సేన పార్టీ అభ్య‌ర్థుల గెలుపుకోసం కృషి చేస్తాన‌న్నారు.