TGSRTC : ఆర్టీసీ వినూత్న నిర్ణయానికి ప్రయాణీకుల బ్రహ్మరథం
ఆర్టీసీ వినూత్న నిర్ణయానికి ప్రయాణీకుల బ్రహ్మరథం రోజు రోజుకూ పెరుగుతున్న బుకింగ్స్ – ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి హైదరాబాద్ బ్యూరో, జూలై 10, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్–బెంగళూరు మధ్య ప్రయాణించే ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, సాధారణ ప్రయాణీకులకు మరింత చేరువయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TGSRTC ) ప్రవేశపెట్టిన వినూత్న ఆఫర్‌కు ప్రయాణీకుల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్–బెంగళూర్ రూట్లల్లో ఆర్టీసీ బస్సు సర్వీసు...