Addam News
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 7:33 am Posted by : Addam News

అశోక్‌న‌గ‌ర్‌లో నిరుద్యోగుల శాంతియుత మెరుపు ర్యాలీ

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 7, ( అద్దం న్యూస్ ) :

గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల ముందే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని హైద‌రాబాద్ అశోక్‌న‌గ‌ర్‌లో అశోక్ నగర్ లో నిరుద్యోగులు శ‌నివారం రాత్రి శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్న గ్రూప్స్, DSC, FBO, GPO డిగ్రీ అర్హతతో ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా, వచ్చిన ఉద్యోగాల్లో వేల ఫీజులను వసూళ్లు చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతూ నిరుద్యోగులను అడుగడుగున కాంగ్రెస్ ప్ర‌భుత్వం మోసం చేస్తుంద‌ని నిన‌దించారు. నిరుద్యోగులంద‌రం తలపెట్టిన నిరుద్యోగ శాంతియుత మహా ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించ‌డం దారుణ‌మ‌న్నారు. పార్టీలకు అతీతంగా మేము నిరుద్యోగులం నిజాయితీగా చేస్తున్న నిరుద్యోగ ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అణిచివేస్తున్నార‌ని నిరుద్యోగులు మండిప‌డ్డారు. అనుమ‌తి ఇవ్వ‌లేదు కాబ‌ట్టే మెరుపు ర్యాలీని నిర్వ‌హించామ‌న్నారు. గ్రాడ్యుయేట్‌ MLC ఎలక్షన్ ముందే ఉద్యోగాలు భర్తీ చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.