పంచాయితీ కార్మికులకు, ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి
హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా 12769 గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న సుమారు 60 వేల మంది కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు అన్నింటిని వెంటనే చెల్లించాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టియుసిఐ) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టియుసిఐ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్ విద్యానగర్ మార్క్స్ భవన్‌లో జరిగింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి రవి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కె.సూర్యం...