పెన్షనర్లకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన బిల్లును వెనక్కు తీసుకోవాలి – హైదరాబాద్ కలెక్టర్‌కు పెన్షనర్ల వినతి
హైదరాబాద్, జూన్ 23, అద్దం న్యూస్ : కేంద్ర ప్రభుత్వము గవర్నమెంట్ పెన్షనర్లకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన బిల్లును వెనక్కు తీసుకోవాలని అన్ని డిపార్ట్‌మెంట్లు, లైబ్రరీ పెన్షనర్ల సంతకాల సేకరణ లిస్టులను హైదరాబాద్ కలెక్టర్ కు అందచేశారు. కేంద్ర ప్రభుత్వము గవర్నమెంట్ పెన్షనర్లకు వ్యతిరేకంగా సోమవారం హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనను తెలియచేశారు. ఈ నిరసనలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ సెక్రటరి జనరల్ డి.సుధాకర్, పూర్ణచందర్, తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల సంయుక్త కార్యచరణ సమితి సెక్రటరి జనరల్ సత్యనారాయణ, పుల్లయ్య,...