ప్రజల అభివృద్ది, సంక్షేమం తెలుగుదేశం పార్టీకి రెండు కళ్లు
ప్రజల అభివృద్ది, సంక్షేమం తెలుగుదేశం పార్టీకి రెండు కళ్లు – టిడిపి జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న అంబర్‌పేట, జూలై 16, ( అద్దం న్యూస్ ) : తెలుగుదేశం పార్టీ పుట్టిందే ప్రజల కొరకని, ప్రజల అభివృద్ది, సంక్షేమం తెలుగుదేశం పార్టీకి రెండు కళ్లని జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న అన్నారు. తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతమే లక్ష్యంగా చేపడుతున్న '' తెలుగుదేశం – ప్రజాపథం '' కార్యక్రమంలో భాగంగా గురువారం అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం బాగ్ అంబర్‌పేట డివిజన్...