Addam News
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 4:40 am Posted by : Addam News

వార‌సిగూడ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో వ్య‌క్తి అదృశ్యం

వార‌సిగూడ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో
వ్య‌క్తి అదృశ్యం

సికింద్రాబాద్‌, ఆగ‌స్టు 30, ( అద్దం న్యూస్ ) :   వ్య‌క్తి అదృశ్య‌మైన సంఘ‌ట‌న వార‌సిగూడ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. వార‌సిగూడ పోలీస్‌స్టేష‌న్ ఏఎస్ఐ ల‌క్ష్మ‌ణ్ నాయ‌క్ తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి… వార‌సిగూడ‌లో స్థానికంగా నివ‌సించే ఈర సురేష్ ( 30 ) భార్య అనూష రాఖీ పండుగ సంద‌ర్భంగా ఈ నెల 28వ తేదీన త‌న త‌ల్లి ఇంటికి వెళ్లింది. ఈ నెల 29వ తేదీన అనూష త‌న భ‌ర్త సురేష్‌కు ఫోన్ చేయ‌గా స్పందించ‌క‌పోవ‌డంతో ఆమె ఇంటికి తిరిగి వ‌చ్చి చూడ‌గా సురేష్ క‌నిపించ‌లేదు. దీంతో ఆమెతో పాటు కుటుంబ‌స‌భ్యులు ప‌రిస‌ర ప్రాంతాల్లో గాలించిన‌ప్ప‌టికి సురేష్ ఆచూకి ల‌భించ‌లేదు. ఈ మేర‌కు ఆమె వార‌సిగూడ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు పోలీసులు మిస్సింగ్ కేసును న‌మోదు చేశారు. అదృశ్య‌మైన సురేష్ ఎత్తు అడుగులు ఉంటాడ‌ని, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో మాట్లాడగ‌లుగుతాడ‌ని, అదృశ్య‌మైన స‌మ‌యంలో తెల్ల రంగు ష‌ర్ట్ ధ‌రించి ఉన్నాడ‌ని పోలీసులు తెలిపారు. ఇత‌న్ని ఎవ‌రైనా గుర్తించినా, ఆచూకి తెలిసినా వార‌సిగూడ పోలీస్‌స్టేష‌న్‌లో స‌మాచారం ఇవ్వాల‌ని ఏఎస్ఐ ల‌క్ష్మ‌ణ్ నాయ‌క్ కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png