శ్యామ్ బాబా ఆలయంలో వైభవంగా ఫాల్గుణి మేళా వేడుకలు

అంబ‌ర్‌పేట్‌, అద్దం న్యూస్‌ : భక్తిభావం వెల్లివిరిసింది. జై కృష్ణ జై జై నినాదాలు మిన్నంటాయి. కలియుగ కృష్ణుడిగా భావించే శ్యామ్ బాబా మహాభారత యుద్ధంలో తన శిరస్సును శ్రీకృష్ణ భగవానుడికి దానమిచ్చే రోజుగా చెప్పుకునే 'ఫాల్గుణి మేళా' వేడుకలు అంగరంగ వైభవం గా జరిగాయి. రంగు రంగుల జెండాలు చేతబట్టి రంగులు చల్లుకుంటూ కృష్ణుడి చిత్రపటాల ప్రదర్శన, బ్యాండ్ మేళాలు, భజన కీర్తనలు, యువతీ యువకులు, భక్తుల నృ త్యాలతో సాగిన 'నిషాన్' శోభా యాత్రలు అంబరాన్నంటాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో...