Addam News
Newspaper Banner
Date of Publish : 14 June 2025, 2:19 am Posted by : Addam News

ఆక్రమణ నిర్మాణాల తొలగింపు సమయంలో ధ్వంసమైన పైప్‌లైన్ –  యుద్ధ ప్రాతిప‌దిక‌న ప‌నులు చేప‌ట్టిన అధికారులు – మ‌ర‌మ్మ‌తుల పనులను పరిశీలించిన జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 13, అద్దం న్యూస్ :    చింతల్ బస్తీ వద్ద ధ్వంసం అయిన 300 ఎంఎం డయా మెయిన్ పైప్‌లైన్‌ అత్యవసర మరమ్మతుల పనులను జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని అధికారులతో చర్చించారు. స్థానికులకు నీటిసరఫరా ఇబ్బంది తలెత్తకుండా వెంటనే మరమ్మతులు పనులు పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరణ చేయాలని సూచించారు. అలాగే కొత్తగా నిర్మించిన పైప్‌లైన్‌కు బలోపేతం చేయడానికి సరైన ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గురువారం సాయంత్రం హైడ్రా నాలా ఆక్రమణ తొలగింపు సమయంలో బంజారా హిల్స్ సంప్ ఔట్‌లెట్ నుండి మసాబ్ ట్యాంక్, ఏసీ గార్డ్స్‌కు మంచినీటిని సరాఫరా చేసే 300 ఎంఎం డయా పైప్‌లైన్‌ దెబ్బతిన్న‌ది. వెంటనే స్పందించిన జలమండలి అధికారులు.. యుద్ధ ప్రాతిప‌దిక‌న మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేప‌ట్టి.. శుక్ర‌వారం సాయంత్రం 2 గంటల వరకు వేగంగా పూర్తి చేశారు. త‌ర్వాత నీటి స‌ర‌ఫ‌రాను పున‌రుద్ధ‌రించారు. దీంతో.. ఏసీ గార్డ్స్, చింతల్ బస్తీ, మసాబ్ ట్యాంక్ ప‌ర‌ధిలోని అన్ని ప్రాంతాల‌కు నీటి స‌ర‌ఫ‌రా య‌థావిధిగా జ‌రుగుతోంది. అంతకు ముందు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉచిత ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png