ఆక్రమణ నిర్మాణాల తొలగింపు సమయంలో ధ్వంసమైన పైప్‌లైన్ – యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టిన అధికారులు – మరమ్మతుల పనులను పరిశీలించిన జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 13, అద్దం న్యూస్ : చింతల్ బస్తీ వద్ద ధ్వంసం అయిన 300 ఎంఎం డయా మెయిన్ పైప్‌లైన్ అత్యవసర మరమ్మతుల పనులను జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని అధికారులతో చర్చించారు. స్థానికులకు నీటిసరఫరా ఇబ్బంది తలెత్తకుండా వెంటనే మరమ్మతులు పనులు పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరణ చేయాలని సూచించారు. అలాగే కొత్తగా నిర్మించిన పైప్‌లైన్‌కు బలోపేతం చేయడానికి సరైన ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గురువారం సాయంత్రం హైడ్రా నాలా...