ప్రధాన జలవనరుల అనుసంధానానికి ప్రణాళిక రూపొందించాలి – జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
హైదరాబాద్ బ్యూరో, అక్టోబర్ 3, ( అద్దం న్యూస్ ) : నగర నీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కృష్ణా, గోదావరి, మంజీరా, ఉస్మాన్‌సాగర్ తదితర ప్రధాన జలవనరులను పరస్పరం అనుసంధానించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖాజాగూడ ఎక్స్‌రోడ్స్ వద్ద ఇటీవల పూర్తిచేసిన 900 ఏంఏం డయా పైప్‌లైన్ జంక్షన్‌ను ఎండీ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి జలాలను ప్రశాసన్‌నగర్ వరకు తీసుకువచ్చే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఏదైనా ఒక...