Addam News
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 12:06 am Posted by : Addam News

సిఎస్ డైరెక్టర్ కు కవుల సన్మానం

సిఎస్ డైరెక్టర్ కు కవుల సన్మానం

ఎర్రమంజిల్, మే 19, ( అద్దం న్యూస్ ) :    పౌరసరఫరా శాఖ రాష్ట్ర సంచాలకులుగా ఇటీవల పదోన్నతి పొందిన జి.వి.శ్యాంప్రసాద్ లాల్ ను ” కవి సాయంత్రం ” కవులు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు వారు నగరంలోని ఎర్రమంజిల్ లో గల పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో మంగళవారం కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అంచలంచలుగా పదోన్నతి పొందడం ఆయన క్రమశిక్షణకు, కార్యదీక్షకు నిదర్శనం అని అన్నారు. రానున్న కాలంలో వారు మరింత ఉన్నతంగా ఎదిగి మహోన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కవి సాయంత్రం గ్రూప్ అధ్యక్షులు ముక్కెర సంపత్ కుమార్, హైదరాబాద్ మహానగర పట్టణ అధ్యక్షురాలు బేతి కవిత, సినీ గేయ‌క‌వి మౌనశ్రీ మల్లిక్, సీనియర్ పాత్రికేయులు బోయిన భాస్కర్, జలమండలి పిఆర్ఓ సుభాష్ చంద్రబోస్, కవులు దేవర కనకయ్య, వాసుదేవ, చేపూరి కుమార్, రవి ప్రసాద్ సాండేసరి, నూకల అశోక్ యాదవ్, పండరీనాథ్, అరుణోదయ నిర్మల, శ్రావ్య సాయి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png